శిష్టులను మన్నించే శిశువీతడు - దుష్టులననిచి భూమి తుదకేక్కునీతుడు || దేవకీదేవి వసుదేవులకు జనియించె - భావించ కృష్ణుడు పరబ్రహ్మహము శ్రావణ బహుళాష్టమి సమకూడే నడురేయి ఈవేళ రోహిణి యిన్నిటాను మంచిది ||1|| శిష్టులను మన్నించే శిశువీతడు - దుష్టులననిచి భూమి తుదకేక్కునీతుడు || గండముతో పుట్టెనదే కంసునికి మేనల్లుడు - పాండవులందరికి బావమరిది దుండగపు భూభారము తొలగదొబ్బునీతడు - ఎండనీడ కన్నులవాడికినింత మంచింది ||2|| శిష్టులను మన్నించే శిశువీతడు - దుష్టులననిచి భూమి తుదకేక్కునీతుడు || ఆవులితని పేరిట నచ్హివచ్చులెంచి చూడ - వేవేలు గొల్లెతలుకు విటుడవును శ్రీ వెంకటాద్రి నున్నాడు చేరి అలమేల్మంగతో - యీవల పెద్దలు చెప్పిరి ఇకనింతా మంచిది ||3|| శిష్టులను మన్నించే శిశువీతడు - దుష్టులననిచి భూమి తుదకేక్కునీతుడు ||
Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to umaramana@gruhinii.com